: భాగ్యనగరిలో తొలిసారిగా ఇళయరాజా సంగీత కచేరి!
మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా హైదరాబాద్ లో తొలిసారిగా సంగీత కచేరి చేయనున్నారు. నవంబర్ 5న గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియంలో సంగీత కచేరి ఇవ్వనున్నారు. హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో ఈ రోజు జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ గాయని చిత్ర, మనో, సాధనాసర్గమ్, కార్తీక్ తదితర గాయకులు ఈ కచేరీలో పాల్గొననున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇళయరాజా మాట్లాడుతూ, హైదరాబాద్ లో గతంలో తానెప్పుడూ సంగీత కచేరి చేయలేదని, ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.