: తన కారు ఓవర్ టేక్ చేసినందుకు యువకుడిని చంపిన కేసులో రాకీ యాదవ్‌కి జీవిత ఖైదు!
తన కారును ఓవర్ టేక్ చేసినందుకు యువకుడిని చంపిన కేసులో బీహార్‌కు చెందిన జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమాదేవి కొడుకు రాకీ యాదవ్‌తో పాటు మరో ముగ్గురికి గయ జిల్లా కోర్టు ఈ రోజు శిక్ష ఖరారు చేసింది. ఈ హత్యకేసులో రాకీయాదవ్ తో పాటు మరో ఇద్దరికి జీవితకాల శిక్ష పడగా, మరో నిందితుడు, రాకీ యాదవ్ తండ్రి బిందీ యాదవ్‌కు ఐదేళ్ల శిక్ష పడింది. గతేడాది తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న కారణంతో ఆదిత్య సచ్‌దేవ్ అనే యువకుడిని రాకీయాదవ్ చంపేశాడు. ఆ సమయంలో రాకీయాదవ్ స్నేహితులు కూడా కారులో ఉన్నారు.
ఈ ఘటనతో రాకీ తల్లి మనోరమా దేవిని జేడీయూ నుంచి బహిష్కరించారు. అయితే, ఈ కేసులో కలుగజేసుకుని తన కుమారుడిని రక్షించేందుకు, సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నించిన రాకీ యాదవ్ తండ్రి బిందీ యాదవ్‌కు కూడా శిక్ష పడింది.