: గోరక్షకుల హింసను అడ్డుకోండి... కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు
గోరక్షణ ముసుగులో అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్న వారిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. గోరక్షకులు చేస్తున్న హింసను అడ్డుకోవాలని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో గోరక్షకుల హింసను కట్టడి చేయడానికి ఓ సీనియర్ పోలీసు అధికారిని నియమించాలని సూచించింది. వీరిపై చర్య తీసుకోవడానికి ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏడు రోజుల్లోగా ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ విషయంలో వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, ఎలాగైనా గోరక్షణ నెపంతో జరుగుతున్న హింసను అడ్డుకోవాలని సూచించింది.