tapsee: ఎక్కడికక్కడ మాట మార్చేస్తోన్న తాప్సీ

తాప్సీ ఏ రోటి దగ్గర పాట ఆ రోటి దగ్గర పాడేస్తుందనీ .. ఏ ఎండకి ఆ గొడుకు పట్టేస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేసేస్తోంది. ఒకప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించడమే తన అదృష్టమని చెప్పిన  తాప్సీ,  ఈ మధ్య ఆయన శైలినే ఎక్కిరించి విమర్శల పాలైంది. బాలీవుడ్లో నటనకి అవకాశం వున్న కథానాయిక పాత్రలు ఉంటాయనీ, టాలీవుడ్ లో మాత్రం అందాల ఆరబోతకు మాత్రమే ప్రాధాన్యత వుంటుందనే విమర్శలు చేసింది.

 అందాల ప్రదర్శనపై ఆధారపడకుండా బాలీవుడ్ లో కొనసాగుతుండటం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చిన ఆమె, 'జుద్వా 2' లో రెచ్చిపోయింది. ఈ సినిమాలో ఆమె మరో హీరోయిన్ అయిన జాక్విలీన్ కి మించి గ్లామర్ ను ఒలకబోయడం బిత్తరపోయేలా చేస్తోందట. తాప్సీ చెప్పినదానికి .. చేసిన దానికి పొంతన లేకపోవడంతో, అవసరానికి తగినట్టుగా ఆమె మాట మార్చేస్తోందని చెప్పుకుంటున్నారు.  
tapsee

More Telugu News