mahesh babu: డ్రాకులా కోటలోకి వెళ్లలేకపోయినందుకు బాధగా వుంది : రకుల్

షార్ట్స్‌లో చూడండి
సినిమా తారలు షూటింగ్ నిమిత్తం విదేశాలకి వెళ్లడం సహజంగా జరుగుతూ ఉంటుంది. షూటింగ్ లేని సమయాల్లో వాళ్లు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను దర్శిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అలా తాను కూడా చాలాసార్లు చేశాననీ .. ఈ సారి మాత్రం కుదరలేదని రకుల్ చెబుతోంది. ఇటీవల ఆమె 'స్పైడర్' సినిమాకి సంబంధించిన పాట షూటింగ్ కోసం 'రొమేనియా' వెళ్లింది.

అక్కడి సిబియు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. డ్రాకులా బర్త్ ప్లేస్ కావడం వలన ఆ ప్రదేశం తనకి ఎంతో కొత్తగా అనిపించిందని అంటోంది. డ్రాకులా కోటను బయటి నుంచి చూసి ఆశ్చర్యపోయాననీ .. లోపలికి వెళ్లే సమయం లేకపోవడం బాధ కలిగించిందని చెబుతోంది. 'స్పైడర్' పాటను రెండు భాషల్లో తీయడం వలన సమయం సరిపోలేదనీ, ఈసారి మళ్లీ అక్కడికి వెళ్లే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది.    
Go Back to Shorts
mahesh babu
rakul

More Telugu News