: కథ బాగుంటే మహేశ్ తో నటిస్తాను... రవితేజతో నటించడం ఫన్నీగా ఉంటుంది: ఇలియానా


మంచి కథ దొరికితే మహేశ్‌ బాబుతో నటిస్తానంటోంది సన్నజాజి సుందరి ఇలియానా. ‘పోకిరి’ సూపర్ హిట్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన ఇలియానా కొన్నాళ్లకు బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ చేసిన సినిమాలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో మళ్లీ టాలీవుడ్ బాట పట్టాలనుకుంటోందని, ఆమెకు మహేశ్‌ బాబు సినిమాలో ఆఫర్ కూడా వచ్చిందని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలియానా ట్విట్టర్ ఛాట్ కు వచ్చింది.

ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రస్తుతానికి తనకు మహేశ్‌ తో ఎలాంటి ఆఫర్‌ రాలేదని స్పష్టం చేసింది. కథ బాగుంటే మహేశ్ తో తప్పకుండా నటిస్తానని తెలిపింది. టాలీవుడ్ లో తనకు ఇష్టమైన నటుల్లో రవితేజ ఒకరని చెప్పింది. ఆయనతో కలిసి పనిచేస్తున్నంత సేపు చాలా ఫన్నీగా ఉంటుందని తెలిపింది. ఆయనతో ఎన్నిసార్లు నటించినా సరదాగా ఉంటుందని ఇలియానా చెప్పింది. కాగా, తాజాగా ఆమె నటించిన హిందీ చిత్రం ‘బాద్షా హో’ సినిమా విజయం సాధించింది. 

  • Loading...

More Telugu News