kangana ranaut: కుర్రకారును రెచ్చగొట్టే పాత్రలో కంగనా రనౌత్!

మనసులో ఏదీ దాచుకోకపోవడం కంగనా రనౌత్ కి అలవాటు. ఇతరులు మాట్లాడటానికి ఆలోచించే మాటలను ఆమె చాలా తేలికగా అనేస్తుంది. అలాగే కొంతమంది కథానాయికలు చేయడానికి ఆలోచించే పాత్రలని నిర్మొహమాటంగా చేసేస్తుంది. అందుకే ఆమె చాలా ధైర్యవంతురాలని సన్నిహితులు అంటూ వుంటారు. అలాంటి కంగనా తాజా చిత్రంగా 'సిమ్రాన్' ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

హన్సాల్ మెహతా తెరకెక్కించిన ఈ సినిమాలో, తాను శృంగార పరమైన ఆలోచనలు ఎక్కువగా వుండే పాత్రలో కనిపిస్తానని కంగనా చెప్పింది. భర్త నుంచి విడాకులు తీసుకుని .. విరహంతో రగిలిపోయే పాత్రలో నటించానని అంది. అయితే అభ్యంతరకరంగా కాకుండా కళాత్మకంగా ఆయా సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందనీ, ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చింది.  
kangana ranaut

More Telugu News