: గోదావరిని పెన్నా, సోమశిలతో అనుసంధానం చేస్తాం: సీఎం చంద్రబాబు


గోదావరి నదిని పెన్నా, సోమశిలతో అనుసంధానం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా నదికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోనే నదుల అనుసంధానానికి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రాష్ట్రానికి నీటి భద్రత ఉండాలని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేశామని అన్నారు. నీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, రేపటి నుంచి మూడు రోజుల పాటు ‘జలసిరి హారతి’ కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై విమర్శలు గుప్పించినా, కోర్టులకు వెళ్లినా ఏడాదిలోపే దీనిని పూర్తి చేశామని, గోదావరి నీటితో కృష్ణా డెల్టా సస్యశ్యామలమైందని అన్నారు.
 

  • Loading...

More Telugu News