: డేటా స్పీడులో కొనసాగుతోన్న రిలయన్స్ జియో జోరు!


నేటితో రిల‌య‌న్స్‌ జియో తన టెలికాం సర్వీసులను వాణిజ్యపరంగా ప్రారంభించి ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూనే కోట్లాది మంది యూజ‌ర్ల‌ను సొంతం చేసుకున్న రిల‌య‌న్స్ జియో డేటా స్పీడులోనూ త‌న జోరు కొన‌సాగిస్తోంది. ఈ రోజు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) టెలికాం కంపెనీల డేటా స్పీడ్‌పై వివరాలు వెల్ల‌డించింది. ఈ ఏడాది జూలై నెలలో రిలయన్స్‌జియోనే టాప్‌లో నిలిచినట్టు ట్రాయ్ తెలిపింది. ఆ నెల‌లో సగటు డౌన్‌లోడ్‌ స్పీడు 18.331 ఎంబీపీఎస్ అని తెలిపింది. వరుసగా ఏడు నెలలు జియోనే టాప్ లో ఉంది. జియో త‌రువాత ఎయిర్‌టెల్‌ స్పీడు 9.266 ఎంబీపీఎస్‌, ఐడియా సెల్యులార్‌ స్పీడు 8.833 ఎంబీపీఎస్‌, వొడాఫోన్‌ ఇండియా స్పీడు 9.325ఎంబీపీఎస్‌గా ఉంది.

  • Loading...

More Telugu News