: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బుక్ చేసుకున్న ఆడిటోరియంను రద్దు చేసిన మమతా బెనర్జీ
ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించ తలపెట్టిన ఓ కార్యక్రమం కోసం కోల్‌కతాలోని ప్రఖ్యాత మహజాతి సాదన్ ఆడిటోరియంను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) బుక్ చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని, ప్రసంగించనున్నారు. అయితే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందుకు అడ్డుతగిలారు. భగవత్ చేసుకున్న ఆడిటోరియం బుకింగ్‌ను రద్దు చేశారు. ఆ ఆడిటోరియం పశ్చిమ బెంగాల్ సర్కారు అధీనంలో ఉంది. దానిని ఆర్ఎస్ఎస్‌కి ఇవ్వడం మమతా బెనర్జీకి ఇష్టం లేదని సమాచారం.