chiranjeevi: చిరంజీవిని వదిలేది లేదు.. ఆయనతో సినిమా చేసి తీరతా!: పూరి జగన్నాథ్

చిరంజీవిని వదిలేదు లేదు .. ఈసారి ఆయనతో సినిమా చేసి తీరుతానని తాజా ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ చెప్పాడు. 'చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను .. ఒక వీరాభిమానిగా ఆయన సినిమాలు ఎలా ఉండాలో తెలుసు .. ఒక దర్శకుడిగా ఆయనను ఎలా చూపించాలనే విషయంలో నాకు ఒక స్పష్టమైన విజన్ వుంది. అలాంటప్పుడు ఆయన స్థాయికి తక్కువగా అనిపించే సినిమాను ఎందుకు చేస్తాను?' అంటూ పూరి అన్నాడు.

 'ఆటో జానీ' కథ చిరూకి బాగా నచ్చిందనీ, అయితే ఆయన ఆ సినిమా చేయకుండా కొంతమంది ప్రభావితం చేశారని చెప్పాడు. 3 నెలల క్రితం చిరంజీవికి మరో కథ వినిపించాననీ, ఈ కథ కూడా ఆయనకి బాగా నచ్చిందని అన్నాడు. గతంలో మాదిరిగా ఈసారి జరగనీయననీ, ఈ కథతో ఆయనతో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం చిరూ 'సైరా నరసింహా రెడ్డి' చేస్తున్నారు. ఆ తరువాత బోయపాటి దర్శకత్వంలో ఆయన సినిమా ఉంటుంది. ఈ ప్రాజెక్టు తరువాత పూరి ప్రాజెక్టు విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం వుంది.   
chiranjeevi

More Telugu News