: భారత్, చైనాలు ప్రపంచ శక్తులు: మోదీతో జిన్ పింగ్


చైనాలోని బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించారని సమాచారం. బ్రిక్స్‌ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు జిన్‌ పింగ్‌ ను మోదీ అభినందించారు. భారత్‌-చైనాలు పరస్పరం అగ్ర పొరుగుదేశాలని, ప్రపంచ శక్తులుగా ఆవిర్భవిస్తున్న అతిపెద్ద దేశాలని జిన్ పింగ్ తెలిపారు. తమ రెండు దేశాల నడుమ ఆరోగ్యకరమైన సంబంధాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 73 రోజుల డోక్లాం ప్రతిష్ఠంభన నేపథ్యంలో 1954లో భారత్‌-చైనా కుదుర్చుకున్న పంచశీల ఒప్పందం అమలులో భారత్‌ తో కలిసి పనిచేసేందుకు, భారత్‌ మార్గదర్శకత్వాన్ని కోరేందుకు చైనా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. వీరి భేటీపై ఆసక్తి రేగుతోంది. 

  • Loading...

More Telugu News