allari naresh. nikhila vimal: గ్లామర్ ఒలకబోసే పాత్రలకి దూరంగానే ఉంటాను : నిఖిలా విమల్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరకు ఇతర భాషల నుంచి వచ్చే కథానాయికల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. తాజాగా 'మేడ మీద అబ్బాయి' సినిమాతో మరో కొత్త కథానాయిక పరిచయమవుతోంది. ఆ కథానాయిక పేరే .. నిఖిలా విమల్. తమిళ .. మలయాళ భాషల్లో కుర్రకారు ప్రేక్షకుల మనసులను దోచుకోవడంలో నిఖిలా విమల్ సక్సెస్ ను సాధించింది. తనకి తెలుగు రాకపోవడం వలన ఇన్నాళ్లూ ఈ వైపు దృష్టి పెట్టలేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.

ఈ సినిమా దర్శకుడు ప్రజీత్ మలయాళీ అనీ .. ఆయనతో గల పరిచయం కారణంగానే ఈ సినిమాకి ఓకే చెప్పానని అంది. అల్లరి నరేష్ తో పరిచయమైన తరువాతనే ఆయన సినిమాలు చూశాననీ, ఆయన ఎంత మంచి నటుడో తెలిసిందని చెప్పింది. గ్లామర్ ఒలకబోసే పాత్రలకి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాననీ, అందంగా కనిపిస్తూ .. నటనకి ప్రాధాన్యమున్న పాత్రలను చేయడానికి తాను ఆసక్తిని చూపుతానని చెప్పుకొచ్చింది. మరోపక్క, 'గాయత్రి' సినిమాలో ఈ అమ్మాయి మోహన్ బాబుకి కూతురుగా చేస్తుండటం విశేషం.     
Go Back to Shorts
allari naresh. nikhila vimal

More Telugu News