: బళ్లారి వెళ్లద్దు!: గాలి జనార్దనరెడ్డికి సుప్రీం ఆదేశం
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అక్రమ ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన... తన సొంత వూరు బళ్లారికి వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆయన వినతిని తోసిపుచ్చింది. ఆయనను బళ్లారికి వెళ్లనిస్తే సాక్ష్యాలను నాశనం చేయడం, లేదా తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ న్యాయవాదులు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. కాగా, జైలు నుంచి బెయిల్ పై విడుదలైన గాలి జనార్దనరెడ్డి తన కుమార్తె వివాహం సందర్భంగా సొంత ఊరు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉంటున్నారు.