: ప‌ని లేక‌పోవ‌డంతోనే లాలూ ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు: నితీశ్ కుమార్‌

కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకుంటున్నారంటూ లాలూ ప్ర‌సాద్ యాదవ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. తాను కూట‌మి నుంచి బ‌య‌టికి వ‌చ్చాక ఎలాంటి ప‌నిలేక‌పోవ‌డంతో లాలూ ప్ర‌సాద్ ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, రాష్ట్రం అభివృద్ధి చేసే ప‌నిలో తాను బిజీగా ఉన్నాన‌ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి ఆలోచించే తీరిక కూడా ఉండ‌టం లేద‌ని నితీశ్ అన్నారు.

`కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త‌న చెప్పుచేత‌ల్లో ఉండాల‌ని లాలూ కోరుకుంటాడు. అలా ఉండ‌లేని వాళ్లు ఎదురుతిర‌గ‌డంతో ఆయ‌న ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. వాటికి, మాకు ఎలాంటి సంబంధం లేదు. మా దృష్టి మొత్తం ఇప్పుడు బిహార్‌ను అభివృద్ధి చేయ‌డం మీదే ఉంది` అని నితీశ్ వివ‌రించారు. గ‌త జూలైలో లాలూ పార్టీ, కాంగ్రెస్‌ల నుంచి నితీశ్ వర్గం వేరు ప‌డి బీజేపీ కూట‌మిలో చేరిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News