karthikeya: నిర్మాణ రంగంపై రాజమౌళి తనయుడు కార్తికేయ ఆసక్తి!
రాజమౌళి మాదిరిగానే ఆయన తనయుడు కార్తికేయకి కూడా సినిమాలే ప్రపంచం. కార్తికేయకి దర్శకత్వ శాఖపైనా .. నిర్మాణం పైన మంచి అవగాహన ఉండటమే కాకుండా, టెక్నీకల్ గా కూడా ఆయనకి మంచి నాలెడ్జ్ వుంది. అందువలన ఆయన ఎప్పటికప్పుడు తన క్రియేటివిటీని తెరపై చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు.
నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన 'యుద్ధం శరణం' సినిమాకి సాయి కొర్రపాటి నిర్మాత. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను ఆయన కార్తికేయకు అప్పగించాడట. తనకి అప్పగించిన బాధ్యతను కార్తికేయ ఎంతో సమర్ధవంతంగా పూర్తి చేశాడని అంటున్నారు. ఈ సినిమా టీమ్ తో కలిసిపోయి .. మంచి అవుట్ పుట్ రావడంలో కీలకమైన పాత్ర పోషించాడని చెబుతున్నారు. సినిమా నిర్మాణంపై కార్తికేయకి ఎంతో ఆసక్తి ఉందనీ, భవిష్యత్తులో ఆయన ఒక మంచి నిర్మాతగా మారే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.