mohan babu: నా తల్లిదండ్రులే నా జీవితాన్ని నడిపించిన శక్తులు : మోహన్ బాబు

షార్ట్స్‌లో చూడండి
చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి మోహన్ బాబు అంచలంచెలుగా ఎదిగారు. తొలినాళ్లలో ఎదురైన కష్టాల నుంచి పాఠాలను నేర్చుకుంటూ .. అవమానాలను అభివృద్ధికి మెట్లుగా చేసుకుంటూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. విలన్ గా అశేష ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన, హీరోగాను సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని సక్సెస్ ను సాధించారు. ఇక నిర్మాతగాను అనే చిత్రాలను నిర్మిస్తూ .. విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్నారు.

 విద్యాలయాలను స్థాపిస్తూ .. వాటిని ఆదర్శ నిలయాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇలా జీవితంలో తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన కృషి .. పట్టుదల .. క్రమ శిక్షణ కారణమని మోహన్ బాబు అన్నారు. వాటిని తనకి అందించిన ప్రత్యక్ష దైవాలు .. తన తల్లిదండ్రులని చెప్పారు. వారు పంచిన ప్రేమ .. క్రమశిక్షణలే తనని ముందుకు నడిపిస్తోన్న శక్తులనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.   
Go Back to Shorts
mohan babu

More Telugu News