: నాతో పని చేసినప్పుడు గౌతమ్ రెడ్డికి నా వ్యాపారాల గురించి తెలియవా?: మల్లాది విష్ణు

విజయవాడ వైఎస్సార్సీపీలో గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆ పార్టీ విజయవాడ నేత మల్లాది విష్ణు మాట్లాడుతూ, రంగాను విమర్శించే స్థాయి గౌతమ్ రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు. తాను చేసే వ్యాపారాలేంటో విజయవాడలో అందరికీ తెలుసని ఆయన అన్నారు.

 2009 ఎన్నికల్లో తనతోపాటు కలిసి పని చేసిన గౌతమ్ రెడ్డికి తన వ్యాపారాలేంటో తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యల ప్రభావం వైఎస్సార్సీపీపై పడదని ఆయన చెప్పారు. కాపులకు వైఎస్సార్సీపీపై విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. కాపులకు న్యాయం చేసేది వైఎస్సార్సీపీయేనని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలు సరైనవి కాదనే పార్టీ అతనిపై చర్యలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు. 

More Telugu News