: మళ్లీ సొంతగూటికి చేరనున్న సైనా నెహ్వాల్!
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మళ్లీ సొంతగూటికి చేరుకోనుంది. తన మాజీ గురువు పుల్లెల గోపీచంద్ అకాడెమీలో మళ్లీ శిక్షణ పొందనుంది. 2014 సెప్టెంబర్ 2వ తేదీన గోపీచంద్ అకాడమీని వీడి, బెంగళూరులోని విమల్ కుమార్ అకాడమీలో సైనా చేరింది. ఆ తర్వాత రెండు ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలను కూడా సాధించింది. తాజాగా గ్లాస్ గోలో వారం క్రితం జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల సందర్భంగా గోపీచంద్ తో సైనా నెహ్వాల్ మాట్లాడిందట. మరోవైపు, గోపీచంద్ అకాడమీకి సైనా మళ్లీ వస్తుండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.