: గౌతంరెడ్డి ఏమైనా సత్యహరిశ్చంద్రుడా?.. అతనిపై 17 మర్డర్ కేసులున్నాయి.. 300 కోట్ల ఆస్తులున్నాయి: వంగవీటి రాధా అనుచరులు

వంగవీటి మోహనరంగా, రాధాల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం మంచి నిర్ణయమని రాధా అనుచరులు తెలిపారు. రంగా ఇప్పటికీ హీరోనే అని, ప్రజల గుండెల్లో ఆయన ఇంకా నిలిచే ఉన్నారని చెప్పారు. రంగా, రాధాలపై కామెంట్ చేసిన గౌతంరెడ్డి ఏమైనా సత్యహరిశ్చంద్రుడా? అని ప్రశ్నించారు. ఆయనపై 17 మర్డర్ కేసుల్లో ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.

గౌతంరెడ్డికి వైసీపీ ఎన్నో అవకాశాలను ఇచ్చిందని... ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాక, ఎన్నికల సమయంలో ఆర్థిక సాయం కూడా చేసిందని... అయినా ఆయన పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని అన్నారు. కార్పొరేటర్ అయిన గౌతంరెడ్డి ఆయన స్థాయి మేరకే వ్యవహరించాలని సలహా ఇచ్చారు. గౌతంరెడ్డికి రూ. 300 కోట్ల సంపద ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. సత్యనారాయణపురంలో బ్రాహ్మణుల భూములను కబ్జా చేశారని ఆరోపించారు.

More Telugu News