: గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ అధినేత జగన్!
వంగవీటి రాధ, రంగాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయవాడ వైసీపీ నేత గౌతంరెడ్డిపై వేటు పడింది. వైసీపీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రాధ, రంగాలపై గౌతంరెడ్డి వ్యాఖ్యలు సరికాదని, అనవసర వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని జగన్ పేర్కొన్నారు.
కాగా, కడప జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన వైఎస్ జగన్ ఈ రోజు రాత్రి పార్టీ నాయకులతో ఈ అంశంపై చర్చించారు. గౌతంరెడ్డి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా కమిటీని జగన్ ఆదేశించారు.