: కేబినెట్ నుంచి దత్తాత్రేయను తొలగించడం అన్యాయం: వీహెచ్
కేంద్ర కేబినెట్ నుంచి బండారు దత్తాత్రేయను తొలగించడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ వ్యతిరేకిగా మారారని, బీసీలంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్ధిచెప్పాలని అన్నారు. బీసీ నాయకుడిగా పేరు పొందిన బండారు దత్తాత్రేయ కేంద్ర కార్మిక శాఖా మంత్రిగా బాగా పని చేశారని, మంచి పేరు తెచ్చుకున్నారని, అలాంటి వ్యక్తిని పదవి నుంచి తొలగించడమేమిటని ప్రశ్నించారు. ‘ఈసారి బీసీలకు ప్రాధాన్యమిస్తున్నాం’ అని హైదరాబాద్ లో ఇటీవల పర్యటించిన బీజేపీ అగ్రనేత అమిత్ షా చెేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అని చెప్పుకుంటారే తప్పా, బీసీలకు ఆయన ఎటువంటి న్యాయం చేయరని విమర్శించారు.