: జైలులో భర్తను కలిసిన మలయాళ నటి!


సినీ నటి భావన అపహరణ, లైంగిక వేధింపుల కేసుతో సంబంధం ఉన్న ఆరోపణలపై 55 రోజులుగా జైల్లో ఉన్న మలయాళ స్టార్ దిలీప్‌ కుమార్‌ ను ఆయన భార్య కలిసింది. రెండు సార్లు దిలీప్ బెయిల్ కు దరఖాస్తు చేయగా, దానిని విచారించిన కేరళ హైకోర్టు ఈ రెండు సార్లు బెయిలిచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో దిలీప్ భార్య కావ్యమాధవన్ హస్తముందని ప్రధాన నిందితుడు పల్సర్ సన్నీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కావ్య తొలిసారి తన తండ్రి మాధవన్, దిలీప్ కుమార్తె మీనాక్షితో కలిసి జైలుకి వెళ్లింది. జైలులో సుమారు 20 నిమిషాలపాటు ఆయనతో వారు గడిపారు. దిలీప్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడేందుకు వారు నిరాకరించారు. 

  • Loading...

More Telugu News