: తరగతి గదిలో కాల్పులు...అమెరికాలో కాదు భారత్ లోనే!


తుపాకీ పేలుళ్ల సంస్కృతి అమెరికా నుంచి భారత్ కు కూడా దిగుమతైనట్టు కనిపిస్తోంది. హర్యానాలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే..హర్యానాలోని సోనెపట్‌ లోని ఇండస్ట్రియల్‌ ట్రయినింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐటీఐ) తరగతి గదిలో ఒక విద్యార్థి సహ విద్యార్థులతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఒక విద్యార్థి తన బ్యాగులోంచి తుపాకీ తీసి, కాల్పులు జరిపి పరారయ్యాడు. దీంతో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

 దీంతో యాజమాన్యానికి సమాచారం ఇచ్చిన ఇతర విద్యార్థులు రక్తమోడుతున్న స్నేహితుడ్ని ఆసుపత్రిలో చేర్చారు. ఈ తతంగం మొత్తం సీసీటీవీలో నమోదుకావడం విశేషం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. రెండు రోజుల క్రితం నిందితుడు, బాధితుడు ఘర్షణ పడ్డట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరు విద్యార్థుల గురించి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ తరహా సంఘటనలు అమెరికాలో జరగడం సర్వసాధారణం. కాగా, భారత్ లో మాత్రం తరగతిగదిలో కాల్పులు ఇదే తొలిసారి కావడం విశేషం. 

  • Loading...

More Telugu News