: రేపు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేతల పేర్లు ఖరారు!
రేపు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాల్సిన నేతలపై సుదీర్ఘంగా మంతనాలు జరిపిన భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం వారి పేర్లను ఖరారు చేసింది. మోదీ కేబినెట్‌లోకి కొత్తగా 9 మందిని తీసుకోనున్నారు. హర్దీప్ సింగ్ పూరీ, గజేంద్ర సింగ్ షెకావత్, సత్యపాల్ సింగ్, అల్ఫాన్స్ కన్నన్‌తనమ్, అశ్వినీ కుమార్ చౌబే, శివ ప్రతాప్ శుక్లా, వీరేంద్ర కుమార్, అనంత కుమార్ హెగ్డే, రాజ్ కుమార్ సింగ్ రేపు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం.