: జియో బాటలో ఎయిర్‌టెల్... వినియోగదారులను కాపాడుకునేందుకు ఆకర్షించే సరికొత్త ఆఫర్లు!
టెలికాం మార్కెట్‌లోకి రిలయన్స్ వారి జియో ప్రవేశించాక ఇతర నెట్‌వర్క్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొత్త వినియోగదారుల మాట అటుంచితే ఉన్న వినియోగదారులను కాపాడుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ వారు సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టారు. జియో తరహాలోనే కేవలం రూ.399కే అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందించేలా సరికొత్త ఆఫర్‌ను ఎయిర్‌టెల్ కూడా ప్రకటించింది. దీంతో పాటు రూ.149 ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా 2 జీబీ 4జీ డేటాతోపాటు, 28 రోజుల పాటు ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కు అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. అలాగే జియో విడుదల చేసిన 4జీ ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కూడా రూ.2500తో ఓ 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.