: నంద్యాల ఓటమితో నిరుత్సాహపడకండి: వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి


నంద్యాల ఉపఎన్నికలో ఘోర ఓటమి ఎదురైన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. దీంతో, కార్యకర్తల్లో మనోబలాన్ని నింపేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, నంద్యాల ఓటమితో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు కలసి నంద్యాల ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికలో గెలిచారని అన్నారు. వైసీపీ కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలని, పార్టీని శక్తిమంతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అమలు చేయని హామీలను, టీడీపీ ప్రభుత్వంలోని అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. జగన్ ను ముఖ్యమంత్రి చేసేందుకు కార్యకర్తలంతా కష్టపడి పని చేయాలని తెలిపారు. 

  • Loading...

More Telugu News