నన్ను ద్వేషించడమంటే టైమ్ వేస్ట్ చేసుకోవడమే : పవన్ కల్యాణ్
కొన్ని రోజులుగా కత్తి మహేశ్ కి .. పవన్ అభిమానులకి మధ్య జరుగుతోన్న మాటల యుద్ధం గురించి తెలిసిందే. ఈ విషయం గురించి మౌనంగా ఉంటూ వచ్చిన పవన్, తాజాగా 'జనసేన' కార్యకర్తలతో మాట్లాడుతూ .. మహేశ్ కత్తి పేరును ప్రస్తావించకుండానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయాల్లోకి వచ్చాక తన తీరు కొంతమందికి నచ్చవచ్చనీ .. మరికొంతమందికి నచ్చకపోవచ్చని అన్నారు. ఎక్కువ శాతం మంది ఏ వైపు ఉన్నారనేదే ముఖ్యమని చెప్పారు. కొంతమంది తిట్టడం .. మరికొంతమంది సపోర్ట్ చేయడం సహజమనీ, ఇలాంటివి భరించడానికి సిద్ధపడే తాను రంగంలోకి దిగానని అన్నారు. తనని ద్వేషించేవారి సమయం వేస్ట్ అవుతుందనే తప్ప, మరో ఆలోచన చేయనని చెప్పారు. ద్వేషమనేది ద్వేషించేవారి ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుంది .. అలాంటివారి గురించి నేను పట్టించుకోను .. మీరూ అలాగే ఉండండని తన మనసులోని మాట చెప్పారు.