: గవర్నర్ హోదాలో తొలిసారి స్వగ్రామానికి వెళ్లనున్న విద్యాసాగర్ రావు
మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు స్వగ్రామం తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో ఉన్న కోనరావుపేట మండలంలోని నాగారం. గవర్నర్ హోదాలో ఆయన తొలిసారిగా తన స్వగ్రామానికి ఈ రోజు వెళ్లనున్నారు. విద్యాసాగర్ రావు తన బాల్య స్మృతులను పదిలపరచుకునే క్రమంలో భాగంగా, నాగారంలోని కోదండరామ స్వామి ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. దీంతో పాటు, గ్రామంలో పలు అభివృద్ధి పనులపైన ఆయన దృష్టిసారించారు.
ఈ నేపథ్యంలో విద్యాసాగర్ రావు తన గ్రామానికి వెళుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావుకి ఘనస్వాగతం పలికేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. కాగా, విద్యాసాగర్ రావు గవర్నర్ కాకమునుపు జనసంఘ్, జనతా పార్టీ, బీజేపీ పార్టీల నేతగా, ఎమ్మెల్యేగా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా పని చేశారు.