pavan: మరోసారి తండ్రి అవుతోన్న పవన్!

షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ .. రేణు దేశాయ్ దంపతులకు అకీరా నందన్ - ఆధ్య అనే ఇద్దరు పిల్లలు వున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా రేణు దేశాయ్ కి పవన్ దూరంగా ఉంటున్నా, పిల్లలిద్దరికీ ఆయన ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ వుంటారు. వాళ్ల ఆనందం కోసం తగిన సమయాన్ని కేటాయిస్తూనే వుంటారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'అన్నా లెజ్ నొవా'తో తన జీవితాన్ని కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ 'పొలేనా' అనే కూతురు వుంది. ఈ నేపథ్యంలో మరోసారి పవన్ తండ్రి కానున్నట్టు సమాచారం.  డాక్టర్స్ .. అన్నా లెజ్ నొవాకి అక్టోబర్ 14ను డెలివరీ డేట్ గా ఇచ్చారట. పవన్ అభిమానులకు ఇది ఆనందాన్ని కలిగించే విషయమే. ఇక పవన్ 25వ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే.     
Go Back to Shorts
pavan

More Telugu News