: నేడు, రేపు కడపలో పర్యటించనున్న జగన్!
వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తన కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పిస్తారని, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
అనంతరం, ఉదయం 10 గంటలకు వేంపల్లెకు చేరుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని, మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులలోని భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ కుటుంబ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఆదివారం ఉదయం పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, ప్రజలకు అందుబాటులో ఉంటారని అవినాష్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, జగన్ తన కుటుంబసభ్యులతో కలసి నిన్న ఇడుపులపాయ చేరుకున్నారు.