Ileana: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  గోవా బ్యూటీ ఇలియానా తాజాగా హిందీలో ఓ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తోంది. 'బాద్ షాహో' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నెగటివ్ ఛాయలతో సాగే యువరాణి పాత్రను ఈ ముద్దుగుమ్మ పోషిస్తోంది. ఈ పాత్ర చేయడానికి మొదట్లో భయపడ్డానని, అయితే దర్శకుడు మిలన్ ఇచ్చిన ధైర్యంతో చేశానని అమ్మడు చెప్పింది.  
*  హాస్య కథానాయకుడు సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన 'ఉంగరాల రాంబాబు' చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఇందులో మియా జార్జ్ కథానాయికగా నటించింది.
*  సందీప్ కిషన్ నటించిన 'ప్రోజెక్ట్ Z'  చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీంతో ఈ నెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠీ కథానాయికగా నటించింది.  

More Telugu News