: హృతిక్‌ రోషన్ ను ముఖాముఖి కలవాలనుకుంటే తప్పించుకుని తిరుగుతున్నాడు!: కంగనా రనౌత్


ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్‌ రోషన్ ను చాలా కాలంగా ముఖాముఖి కలవాలని అనుకుంటున్నానని, అయితే అతను తనను తప్పించుకుని తిరుగుతున్నాడని కంగనా రనౌత్ తెలిపింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వివాహేతర సంబంధాలు అనేక పరిణామాలకు దారి తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. 'ఉదాహరణకు మలయాళ నటి (భావన) కేసులో ఏమైందో చూడండి. తన భార్యకు తన గురించి ఫిర్యాదు చేసినందుకు ఆయన నటిని ఎలా హింసించారో మనకు తెలిసిందే'నని పేర్కొంది.

ప్రస్తుతం సమాజంలో మహిళలపై దారుణాలు చాలా జరుగుతున్నాయని గుర్తు చేసింది. గర్భిణీలని కూడా చూడకుండా వారిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆమె తెలిపింది. కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిసి చంపేస్తున్నవారు ఎంతో మంది ఉన్నారని ఆమె తెలిపింది. ఇలాంటివన్నీ తల్చుకుంటే తన జీవితం ఏమవుతుందో అని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. 

  • Loading...

More Telugu News