: ఫ‌రాఖాన్ `డీఎన్ఏ టెస్ట్‌` కామెంట్ల‌పై స్పందించిన చంకీ పాండే!

ఇటీవ‌ల బాలీవుడ్ న‌టుడు చంకీ పాండే భార్య భావ‌నా పాండే త‌మ కూతురు అన‌న్య‌పాండే ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ ఫొటోల‌పై ద‌ర్శ‌కురాలు ఫ‌రాఖాన్ `ఈమె చంకీ పాండే కూతురు అన‌డానికి న‌మ్మ‌శ‌క్యంగా లేదు. ఎందుకైనా మంచిది డీఎన్ఏ టెస్ట్ చేయించండి` అని కామెంట్ చేసింది. దీనిపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు కురిపించారు. అలా మాట్లాడటం స‌బ‌బు కాద‌ని ఆమెకు స‌ల‌హాలు కూడా ఇచ్చారు.

 అయితే ఈ అంశంపై ఫ‌రాఖాన్ ఎలాంటి సంజాయిషీ ఇచ్చుకోలేదు. ఈ విష‌యం గురించి చంకీని ప్ర‌శ్నించ‌గా ఆయన ఇలా స్పందించారు. `ఫ‌రా నాకు చాలా మంచి స్నేహితురాలు. ఆమె ఏ ఉద్దేశంతో అలా కామెంట్ చేసిందో నేను అర్థం చేసుకోగ‌ల‌ను. అన‌న్య అందంగా ఉంద‌ని ఫ‌రా త‌న శైలిలో చెప్పింది. ఫ‌రా ఖాన్‌, సాజిద్ ఖాన్‌, నేను ఇలాంటి భ‌యంక‌రమైన జోకులు ఎన్నో వేసుకుంటాం` అంటూ సమర్థించాడు.

More Telugu News