: తిరుమల మీడియా ప్రతినిధులకు గాలి ముద్దుకృష్ణమనాయుడి సూచన!
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో రాజకీయ నేతల విమర్శలు ఎక్కువవుతున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం ఆయన తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ఆయనను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా గాలి మాట్లాడుతూ ఆలయం ముందు రాజకీయ నేతల ఎదుట మైకులు పెట్టవద్దని మీడియా ప్రతినిధులకు సూచించారు. కేవలం మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు, గురువులు, టీటీడీ అధికారులు మాత్రమే ఇక్కడ మాట్లాడాలని ఆయన అన్నారు.