: ట్విట్టర్‌లో 100 మిలియన్ ఫాలోవర్ల మార్క్ దాటిన జస్టిన్ బీబర్!
అమెరికన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ట్విట్టర్‌లో 100 మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను దాటేశారు. మరో పాప్ సింగర్ కేటీ పెర్రీ తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తిగా జస్టిన్ రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ సందర్భంగా జస్టిన్ బీబర్ చేసిన కొన్ని ట్వీట్లను వీడియోగా విడుదల చేసింది. జస్టిన్ చేసిన ట్వీట్లలో `మై బిలీబర్స్ చేంజ్‌డ్ మై లైఫ్ (నా అభిమానులే నా జీవితాన్ని మార్చారు)` అనే ట్వీట్ 6,38,000 సార్లు రీట్వీట్ అయినట్లు ట్విట్టర్ పేర్కొంది.
100 మిలియన్ ఫాలోవర్ల రికార్డును కేటీ పెర్రీ జూన్‌లో చేరుకుంది. ప్రస్తుతం ఆమెకు 103 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో 85.5 మిలియన్ ఫాలోవర్లతో టేలర్ స్విఫ్ట్, 76.9 మిలియన్ల ఫాలోవర్లతో రిహానా ఉన్నారు. ఇదిలా ఉండగా జస్టిన్ బీబర్ మాజీ ప్రియురాలు సెలెనా గోమెజ్ 126 మిలియన్ల ఫాలోవర్లతో ఇన్‌స్టాగ్రాంలో మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.