: ‘జనతాగ్యారేజ్’ను గుర్తుచేసుకున్న జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కరెక్టుగా ఏడాది క్రితం తెరకెక్కిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ ‘జనతా గ్యారేజ్’ గురించి జూనియర్ ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నాడు. ‘‘జనతా గ్యారేజ్’కు ఏడాది. ఈ సినిమా గురించి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. అభిమానులకు, శ్రేయోభిలాషులకు, దర్శకుడు కొరటాల శివకు, మైత్రి మూవీస్ సంస్థకు నా కృతజ్ఞతలు. మోహనల్ లాల్ సార్ కు, సమంతా ప్రభుకు, నిత్య, దేవీశ్రీ ప్రసాద్ .. చిత్ర యూనిట్ లోని ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నాడు.