ఇబ్బందే .. అయినా ఈ ప్రొఫెషన్ అంటే ఇష్టమే : అనూ ఇమ్మాన్యుయేల్
కథలు విన్న తరువాత ఒక నిర్ణయానికి రావడం చాలా కష్టమని అంది. అదే విధంగా అనుకూలంగా లేని షెడ్యూల్స్ ను అనుసరించడం కూడా చాలా ఇబ్బందేనని చెప్పింది. ఇక షూటింగ్స్ వలన కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఉండటం మరీ కష్టమని అంది. రకరకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారనీ, ఒక్కొక్కరినీ ఒక్కోలా ట్రీట్ చేయాల్సి వస్తుంటుందని చెప్పింది. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పటికీ ఈ ప్రొఫెషన్ అంటే తనకి ఎంతో ఇష్టమంటూ చెప్పుకొచ్చింది.