: టీడీపీకి ఝలక్... కాకినాడలో ఓడిపోయిన ఎమ్మెల్యే అన్న కుమారుడు!


ప్రజల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత ఉందని కాకినాడలో తేలింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండబాబు అన్న కుమారుడు కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 22వ డివిజన్ నుంచి పోటీచేసిన కొండబాబు అన్న వమనాడి సత్యనారాయణ కుమారుడు శివప్రసాద్, వైకాపా అభ్యర్థి జాన్ కిశోర్ చేతిలో ఓడిపోయారు. డివిజన్ లో అభివృద్ధి కుంటుపడటం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో విసిగిన ప్రజలు తమ ఆగ్రహాన్ని ఈ విధంగా చూపించారని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, ఆయన మరో కుమారుడు ఉమాశంకర్ 14వ వార్డు నుంచి బరిలోకి దిగారు. ఆయన ఫలితం వెలువడాల్సి వుంది.

  • Loading...

More Telugu News