varun tej: మెగా హీరోకి కథ రెడీ చేస్తోన్న తేజ?

ప్రేమకథా చిత్రాలకి పెట్టింది పేరైన తేజ .. కొన్ని విజయాలను అందుకున్నప్పటికీ, ఆ తరువాత వరుస పరాజయాలు పలకరించాయి. దాంతో ఆయన 'నేనే రాజు నేనే మంత్రి' వంటి ఒక విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి విజయాన్ని సాధించాడు. ఆయన తదుపరి సినిమాపై అభిమానుల్లో ఆసక్తి వుంది.

 ఆయన నెక్స్ట్ మూవీ వరుణ్ తేజ్ తో వుండే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'ఫిదా' సినిమాతో హిట్ కొట్టిన వరుణ్ తేజ్ .. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయనతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో తేజ వున్నాడట. ప్రస్తుతం వరుణ్ తేజ్ కి తగిన కథను రెడీ చేసే పనిలో వున్నాడని అంటున్నారు. వరుణ్ తేజ్ కి కథ నచ్చితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.   
varun tej

More Telugu News