: ప్రభాస్ `సాహో`లో నటించే అవకాశం కోల్పోయిన అరవింద్ స్వామి?
`బాహుబలి` చిత్రాల తర్వాత తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం `సాహో`. ఈ సినిమాలో ఉన్న మూడు ప్రతినాయక పాత్రల్లో ఒకదాని కోసం అరవింద్ స్వామిని అనుకున్నారట దర్శకుడు సుజీత్ రెడ్డి. తమిళ, తెలుగు, హిందీ ప్రేక్షకులకు అరవింద్ స్వామి పరిచయముండటంతో ఆయనైతేనే బాగుంటుందని సుజీత్ నిర్ణయించుకున్నారట. ఈ విషయంపై చిత్రబృందం అరవింద్ స్వామిని కలవగా డేట్లు ఖాళీ లేకపోవడంతో ఆయన ఒప్పుకోలేదని సమాచారం. అయితే అదే స్థానాన్ని ప్రభాస్ చరిష్మాకు సరితూగేలా ఉండేందుకు బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముకేష్‌తో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నీల్ నితిన్ ముకేశ్‌తో పాటు జాకీ ష్రాఫ్, చంకీ పాండేలు ప్రతినాయక పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే.