: ట్రిపుల్ తలాక్ పై పోరాడిన ముస్లిం మహిళ పిల్లలు అదృశ్యం


ట్రిపుల్ త‌లాక్‌ను ర‌ద్దు చేస్తూ ఇటీవ‌లే సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ట్రిపుల్ త‌లాక్ పై ప్ర‌ధానంగా పోరాడిన ఐదుగురు మ‌హిళ‌ల్లో ఒక‌రైన ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన‌ ఇష్ర‌త్ జ‌హాన్‌.. తీర్పు అనంతరం మాట్లాడుతూ త‌న‌కు, త‌న‌ పిల్లలకు రక్షణ క‌ల్పించాల‌ని త‌మ‌ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వినతిపత్రం సమర్పించారు. అయితే, ఈ రోజు ఆమె పిల్ల‌లు క‌న‌పించ‌కుండా పోవ‌డం క‌ల‌క‌లం రేపింది. త‌న ఇద్ద‌రు పిల్ల‌లు అదృశ్య‌మ‌య్యార‌ని గోలాబ‌రి పోలీస్ స్టేష‌న్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె నుంచి ఫిర్యాదు స్వీక‌రించిన పోలీసులు ఆ చిన్నారుల కోసం గాలిస్తున్నారు.  

కాగా, ఏప్రిల్ 2015లో ఇష్ర‌త్ జ‌హాన్‌ భ‌ర్త దుబాయ్ నుంచి ఆమెకు ఫోన్ చేసి త‌లాక్ చెప్పాడు. అనంత‌రం ఆమె న్యాయం కోసం కోర్టును ఆశ్ర‌యించి ఇటీవ‌లే విజ‌యం సాధించింది. 

  • Loading...

More Telugu News