vijay devarakonda: 'అర్జున్ రెడ్డి' దూకుడును 'పైసా వసూల్' ఆపేనా?

షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా 'అర్జున్ రెడ్డి' సినిమా గురించిన టాక్ యూత్ లో నడుస్తూనే వుంది. ఈ సినిమా విడుదలైన తరువాత ఇక యూత్ లో దాని గురించిన చర్చ మాత్రమే నడుస్తోంది. ఇప్పటికే 15 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా, 25 కోట్ల షేర్ ను రాబట్టే దిశగా పరుగులు తీస్తోంది.

 అయితే రేపు 'పైసా వసూల్' సినిమా థియేటర్లలోకి దిగిపోనుంది. పూరి .. బాలకృష్ణ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగానే జరుగుతున్నాయని అంటున్నారు. అందువలన 'అర్జున్ రెడ్డి' వసూళ్లపై 'పైసా వసూల్' ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని టాక్. అయితే అమెరికాలో మాత్రం 'అర్జున్ రెడ్డి' హవానే కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.    
Go Back to Shorts
vijay devarakonda

More Telugu News