: కారుతో స‌హా వ‌ర‌ద‌లో చిక్కుకున్న వ్య‌క్తి... మాన‌వ‌హారంగా ఏర్ప‌డి కాపాడిన స్థానికులు.. వీడియో చూడండి

అమెరికా, టెక్సాస్‌లోని హ్యూస్ట‌న్ ప్రాంతాన్ని హ‌రికేన్ హార్వీ కుదిపేస్తోంది. దీంతో హ్యూస్ట‌న్‌లోని చాలా ప్రాంతాల్లో పీక‌ల్లోతు నీరు చేరిపోయింది. రోడ్లు న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. అలాంటి రోడ్డు మీద కారుతో స‌హా ఓ వ్య‌క్తి చిక్కుకుపోయాడు. దీంతో హ్యూస్ట‌న్ వాసులు ఒక్కొక్క‌రుగా చేయి చేయి క‌లుపుతూ మాన‌వ‌హారంగా ఏర్పడి, అత‌న్ని కాపాడారు. ఇలాగే ఇంకా చాలా మంది త‌మ కార్ల‌తో స‌హా నీటిలో చిక్కుకుపోయారు. వాళ్లంద‌రినీ కూడా మాన‌వ‌హారంగా ఏర్ప‌డి స్థానికులు కాపాడారు. ఇలా కాపాడి మాన‌వత్వాన్ని చాటుకోవ‌డాన్ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు. వీరు కాపాడిన వాళ్ల‌లో ఒక వీడియోను ఇప్పుడు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా షేర్ చేస్తున్నారు.

More Telugu News