mahesh babu: 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో!

మురుగదాస్ - మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందిన 'స్పైడర్' సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కింది కనుక, ఈ రెండు భాషల్లో అటు చెన్నైలోను... ఇటు హైదరాబాద్ లోను రెండు గ్రాండ్ ఈవెంట్స్ జరపాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకున్నట్టుగా తెలుస్తోంది.

చెన్నైలో వచ్చేనెల 9వ తేదీన జరగనున్న ఈవెంట్ లో తమిళ ఆడియో తో పాటు తెలుగు ఆడియోను కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. తెలుగులో మహేశ్ అభిమానులు నిరాశ చెందకుండా ఉండటం కోసం, వచ్చేనెల 16న గానీ 17న గాని ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలనే నిర్ణయానికి వచ్చారట. హైదరాబాద్ - శిల్పకళావేదికలో ఈ వేడుక జరగనుందని సమాచారం. టాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని అంటున్నారు.    
mahesh babu
rakul

More Telugu News