: విశాల్.. నీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి.. నువ్వు రాజకీయాల్లోకి రావాలి: దినకరన్ ఆహ్వానం
కోలీవుడ్ లో విశాల్ ఒక సంచలనం. యాక్షన్ హీరోగా విశాల్ కోలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. స్టార్ డమ్ తో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇటీవలే తెలుగు, తమిళ ప్రముఖలను ఆహ్వానించి తన చెల్లెలి వివాహాన్ని కూడా ఘనంగా నిర్వహించాడు. రిసార్టు రాజకీయాలతో బిజీగా ఉన్న టీటీవీ దినకరన్ మాత్రం వివాహానికి హాజరుకాలేకపోయారు. దీంతో నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు ఆయన విశాల్ నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా విశాల్ తో భేటీ అయ్యారు. అనంతరం విశాల్ లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని కితాబునిచ్చారు. రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానం పలికారు. అయితే, ఆయన ఆహ్వానాన్ని విశాల్ సున్నితంగా తిరస్కరించాడు. ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్టానని తెలిపాడు. అయినా ఇప్పటికే తాను దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలతో పాటు తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో కూడా పోటీ చేసి విజయం సాధించానని, వాటికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పాడు. రాజకీయాలపై తనకు పెద్దగా శ్రద్ధ లేదని ఆయన తెలిపాడు. దీంతో ఎన్నోఆశలతో విశాల్ ను ఆహ్వానించిన ఆయన నిరాశగా వెనుదిరాగారు.