venkatesh: మల్టీ స్టారర్ మూవీలో వెంకీ .. విజయ్ దేవరకొండ!

వైవిధ్యభరితమైన కథా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వెంకటేశ్ తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' .. 'గోపాల గోపాల' వంటి మల్టీ స్టారర్స్ సైతం చేశారు. త్వరలోనే ఆయన మరో మల్టీ స్టారర్ మూవీ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే మరో హీరో ఎవరో కాదు .. విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే ఆయన ఈ సినిమాను అంగీకరించాడట. ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' హిట్ టాక్ ను సొంతం చేసుకుంది కనుక, ఈ మల్టీ స్టారర్ పై అందరిలో ఆసక్తి పెరగనుంది. రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించనున్న ఈ సినిమాకి, భాస్కర్ దర్శకుడిగా వ్యవహరిస్తాడట. పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే ఛాన్స్ వుంది.   
venkatesh
vijay devarakonda

More Telugu News