raj tarun: 'రాజుగాడు యమ డేంజర్'లో కీలకంగా రావు రమేశ్!

తెలుగు తెరకి లభించిన మరో విలక్షణ నటుడే రావు రమేశ్. రావు గోపాలరావు నట వారసుడు అనిపించుకున్నా, తండ్రి నటన ప్రభావం తనపై ఎంత మాత్రం పడకుండా ఆయన చూసుకున్నారు. తనదైన నటనను ప్రదర్శిస్తూ అన్నివర్గాల ప్రేక్షకుల మెప్పును పొందుతున్నారు. అలాంటి రావు రమేశ్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలు వున్నాయి .. వాటిలో 'రాజుగాడు యమ డేంజర్' ఒకటి.

ఈ సినిమాలో ఆయనకి చెప్పుకోదగిన పాత్ర లభించిందని అంటున్నారు. ఈ సినిమాలో రావు రమేశ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందనీ .. సెకండాఫ్ లో మంత్రముగ్ధులను చేస్తుందని చెబుతున్నారు. ఈ పాత్ర చాలాకాలం పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుందట. సంజనా రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ - అమైరా దస్తూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది.       
raj tarun
amyra

More Telugu News