: ప్రిన్సెస్ డయానాను కలవాలని ఆశ పడ్డాను: దీపికా పదుకొణే
ప్రిన్సెస్ డయానాను కలవాలనే ఆశ తనకు చిన్నప్పటి నుంచి ఉండేదని, ఆమెతో తనకు ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించేందని బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణే చెప్పింది. ట్విటర్ లో ఆమె అభిమానుల సంఖ్య రెండు కోట్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ట్విటర్ లో అభిమానులతో కొంచెం సేపు ఆమె ముచ్చటించింది.
‘జీవితంలో ఎవర్ని కలవాలని మీరు అనుకుంటున్నారు?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు దీపికా పదుకొణే పైవిధంగా సమాధానమిచ్చింది. కాగా, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పద్మావతి’ చిత్రంలో దీపిక టైటిల్ రోల్ పోషిస్తోంది. దీపిక సరసన షాహిద్ కపూర్, రణ్ బీర్ సింగ్ నటిస్తున్నారు.