: కొత్తగా ముస్తాబైన యూ ట్యూబ్!
ఇంటర్నెట్‌లో వీడియోలు చూడాలంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది యూ ట్యూబ్.. యూజర్లను ఆకర్షించడానికి ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో ఎన్నో మార్పులు చేసిన యూట్యూబ్ మరోసారి భారీ మార్పులతో ముందుకు వచ్చింది. సరికొత్త లోగో సహా తన డెస్క్‌టాప్, మొబైల్ యాప్స్ డిజైన్‌లో మార్పులు చేపట్టింది. తాజాగా చేసిన ఈ మార్పులతో తమ లోగో వివిధ డివైజ్‌లు, చిన్న స్క్రీన్‌లపై కూడా మెరుగ్గా ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. వ్యూయర్లకు సరికొత్త ఫీల్‌ను ఇచ్చేలా పలు మార్పులు చేశామని చెప్పింది. ఇటీవలే యూట్యూబ్ తమ వీడియోలను తమ సైట్ ద్వారానే షేర్ చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.